యూత్ రాసిన మాస పత్రిక “పెకురా నాంద్” (అంటే గొండిలో యువత యొక్క స్వరము అని అర్థము) రెండవ సంపాదకీయాన్ని మీకు అందించడానికి మేము సంతోషిస్తున్నాము. మా మొదటి సంపాదకీయంలో, యువత పొందిన అనుభవాలను మరియు వారు గమనించిన విషయాలను మీతో పంచుకున్నావారు. ఇప్పుడు, కొన్ని నెలల పాటు సమూహాలతో చేసిన పనిని మీతో పంచుకోవడానికి ఆనందిస్తున్నారు.
ఈ సంపాదకీయంలో, క్షేత్ర స్థాయిలో యువత విద్యా హక్కు కోసం, మహిళా సంఘాలను బలపరచుట కోసం మరియు పెరటి తోటలను పెంపొందించుట కోసం చేస్తున్న పనుల గురించి మరియు ఈ సమూహాలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి పాఠకులు తెలుసుకుంటారు. అంతే కాకుండా, ఆదివాసీ పండుగలు మరియు సాంప్రదాయాల ప్రపంచంలోకి మనం తొంగి చూడవచ్చు.
పెకురా నాంద్ ఇంగ్లీష్, తెలుగు మరియు కన్నడ భాషల్లో ఉంది. దీని గోండి అనువాదం త్వరలోనే రాబోతుంది. రండి, యువ స్వరాలను మాతో పాటు మీరు చదివి తరించండి.